|
అల్లు అర్జున్స్ ‘వేదం’
క్రిష్ తన దర్శకత్వం ప్రతిభను జత చేసి ఇదొక ‘వేదం’ గా చిత్రీకరించాడు. ఈ చిత్రంలో స్లమ్ ఏరియాల్లో తిరుగుతూ రెండు చేతులూ సంపాదించే రౌడీగా అల్లు అర్జున్ అధ్బుతమైన నటనను ప్రదర్శిస్తే రాక్ స్టార్ గా మనోజ్ తన సామర్థాన్ని ప్రదర్శించాడు. మరి అనుష్క రంగసాని పాత్రలో లీనమైపోయింది అని చెప్పడానికి అవధులు లేవంట. అందుకే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు ప్రసాద్ దేవినేని, యార్లగడ్డ శోబు ఆశిస్తున్నారు. క్రిష్ కూడా ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని ఎంతో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడని సినీమా వర్గాల సమాచారం
ఆరు పెద్ద సినిమాలు తాత్కాలికంగా నిలిపివేత
నిర్మాతల మండలి నిర్ణయం మేరకు మే నెలలో మొదలు కావాల్సిన ఆరు భారీ బడ్జెట్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. ఆ ఆగే చిత్రాల్లో వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మించే 'ఆప్తరక్షక', రామ్ చరణ్ తేజ్ తో ధరణి దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ నిర్మించనున్న చిత్రం, అల్లు అర్జున్ తో వినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించే 'బద్రినాథ్', రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'స్రవంతి' రవికిషోర్ నిర్మించే చిత్రం, ప్రభాస్, దశరథ్ కాంబినేషన్ లో 'దిల్'రాజు నిర్మించనున్న చిత్రం, తేజ ఓ స్టార్ హీరోతో చేయబోయే చిత్రం..ఈ జాబితాలో ఉంది. నిర్మాణ వ్యయం అదుపు విషయంలో సరైన మార్గాలను అన్వేషించి, పక్కాగా నిర్ణయాలు తీసుకున్నాకనే ఈ చిత్ర నిర్మాణాలను మొదలుపెట్టాలనే యోచనలో ఆయా నిర్మాతలు ఉన్నట్టుగా తెలిసింది.
గురువారం నిర్మాతల మండలి కార్యాలయంలో చాలామంది నిర్మాతలు సమావేశమై పొదుపు చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టాల్సిన భారీ బడ్జెట్ సినిమాలను ప్రారంభించకుండా కొన్నాళ్లు వేచి చూసే ధోరణి కనబరచాలని కొందరు నిర్మాతలు నిర్ణయించారు. స్టార్స్, సాంకేతిక నిపుణుల పారితోషికాలు రోజు రోజుకీ పెరిగిపోవడంతోపాటు, అత్యధిక పనిదినాలు, అనవసర ఖర్చుల కారణంగా నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన నిర్మాతల మండలి ఎట్టకేలకు ఈ విషయంపై దృష్టి సారించింది. నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసే అంశాలపై అధ్యయనానికి 'దిల్'రాజు అధ్యక్షతన కమిటీని నియమించింది. అల్లు అరవింద్, డాక్టర్ కె.ఎల్.నారాయణ, సి.కళ్యాణ్, 'స్రవంతి' రవికిషోర్, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ, ప్రసన్న కుమార్ తదితరులు ఈ కమిటీలో సభ్యులు.
'ప్రతిరోజు' థ్రిల్లింగ్
థ్రిల్లింగ్ ఇతివృత్తంతో 'ప్రతిరోజు' చిత్రాన్ని మలిచామని దర్శకుడు రాజు రాజేంద్రప్రసాద్ తెలిపారు. బిందుమాధవి, రవిబాబు ప్రధాన పాత్రధారులు. ప్రకాష్ వి.ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లోభాగంగా రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. సినిమా చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులకు ఎంతో థ్రిల్‌ను కలిగించేవిధంగా చిత్రం ఉంటుందని అన్నారు. ఛాయాగ్రహణం, రీరికార్డింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చెప్పారు. బిందుమాధవి, రవిబాబు పాత్ర చిత్రణ ఆసక్తిదాయకంగా ఉంటుందని అన్నారు.
నిర్మాత నాగేందర్.వి. మాట్లాడుతూ, 'టైటిల్‌ను బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వైవిధ్యానికి పెద్దపీట వేసి, దీనిని రూపొందించాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో చలపతిరావు, యం.ఎస్.నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆయేషా, దువ్వాసి, జలీల్, హేమ, హర్షవర్ధన్, చిత్రం భాషా, సత్యం రాజేష్, రాజ్యలక్ష్మి తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి వంశీ ఛాయాగ్రహణాన్ని అందించగా, శామ్‌ప్రసేన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు
|