Vizag4All
Home  |  About Vizag  |  Movies  |  Videos  |  Images  |   City Dial    |  Tips  |  Contact Us
 
SPORTS

వ్యక్తినే పెళ్లాడాను, పాకిస్తానీని కాదు: సానియా

తాను ఓ వ్యక్తిని పెళ్లాడానే గానీ పాకిస్తానీని కాదని హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా అన్నారు. పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సిఎన్ ఎన్ కు తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలు తమ పెళ్లిని రాజకీయం చేయాలనుకుంటున్నారని, తాము ఇద్దరం వ్యక్తులమని, ఇతర సాధారణ వ్యక్తుల మాదిరిగానే తాము వివాహం చేసుకున్నామని ఆమె అన్నారు.

ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలుంటాయని, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటారని, తమ పెళ్లి జరిగినందున తామెంతో ఊరట పొందుతున్నామని ఆమె అన్నారు. భారత్ లో జరిగే కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనడమే తన ప్రథమ ప్రాధాన్యమని ఆమె చెప్పింది. వింబుల్డన్ కూడా ఆడ్తానని ఆమె చెప్పారు. వివాహం తన జీవితంలో మార్పులు తెస్తుందని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటానని తాను అనుకోలేదని ఆమె అన్నారు.

దక్కన్‌ సెమీస్‌ చాన్స్‌ సజీవం

దక్కన్‌ చార్జర్స్‌ కీలక విజయాన్నందుకున్నది. శుక్రవారం కింగ్స్‌ ఎలెవెన్‌తో జరిగిన పోరులో దక్కన్‌ చార్జర్స్‌ అయిదు వికెట్ల తేడాతో గెలుపొంది తమ సెమీస్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకున్నది. తొలుత కింగ్స్‌ ఎలెవెన్‌ 3 వికెట్లకు 174 పరుగులు చేయగా, సమాధానంగా చార్జర్స్‌ అయిదు బంతులు మిగలి ఉండగానే అయిదు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. అర్ధసెంచరీతో చార్జర్స్‌ విజయంలో ముఖ్య భూమిక నిర్వహించిన రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది.

లక్ష్య సాధనలో ఆరంభంలోనే చార్జర్స్‌ కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌ వికెట్‌ను కోల్పో యింది. తరువాత కొద్ది సేపటికే మరోఓపెనర్‌ మోనిష్‌ మిశ్రాకూడా పెవిలి యన్‌ చేరాడు. ఈ తరుణంలో తిరుమలశెట్టి సుమన్‌, రోహిత్‌ శర్మ బాధ్యతా యుత ఇన్నింగ్స్‌ ఆడి చార్జర్స్‌ ఇన్నింగ్స్‌కు జీవంపోశారు. ఇరువురూ ఎటు వంటి తొట్రుపాటు లేకుండా సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోరును ముందుకు నడిపించి అదను దొరికినపుడల్లా బౌండరీలు, సిక్సర్లు కొల్లగొట్టారు. వీరిని విడదీసేందుకు సంగక్కర చే సిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వార మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించి జట్టును సురక్షిత స్థానానికి చేర్చిన తరువాత సుమన్‌ అవుటయ్యాడు. సుమన్‌ 31 బంతులలో మూడు బౌండరీలు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన ఆండ్రూ సిమండ్స్‌ నాలుగు పరుగులకే వెనుతిరిగినా మిచెల్‌ మార్ష్‌ రోహిత్‌కు అండగా నిలిచి జట్టును విజయానికి చేరువ చేశాడు. ఇంకా రెండు ఓవర్లు మిగిలిఉన్న తరుణంలో యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో మార్ష్‌ అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 19 పరుగులు చేయాల్సిన తరుణంలో 19 ఓవర్‌ చివరి రెండు బంతులను రోహిత్‌ సిక్సర్‌, బౌండరీలకు తరలించడంతో చార్జర్స్‌ విజయం ఖాయమైంది. చివరి ఓవర్‌ తొలి బంతిని సుమంత్‌ బౌండరీ కొట్టి విజయాన్ని పూరించాడు.

అంతకుముందు టాస్‌ గెలిచిన దక్కన్‌ చార్జర్స్‌ ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే షాన్‌ మార్ష్‌ వికెట్‌ను కోల్పోయినా కెప్టెన్‌ సంగక్కర, మహేల జయవర్దనెలు అర్ధసెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇరువురూ సంయమనంతో, అవగాహనతో స్కోరును పరుగెత్తించారు. 40 బంతులలోనే 50 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలో సంగక్కర 36 బంతులలోనే అర్ధసెంచరీ పూరించాడు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా పరిణమిస్తున్న తరుణంలో రాహుల్‌ శర్మ సంగక్కరను అవుట్‌ చేసి వారిని విడదీశాడు. సంగక్కర 37 బంతులలో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన యువరాజ్‌ సింగ్‌ సహకారంతో జయవర్ధనె స్కోరును పెంచే బాధ్యత చేపట్టాడు. ముందుగా 16వ ఓవర్‌ తొలి బంతికి స్కోరును వంద పరుగులు దాటించి, ఆపై జయవర్ధనె విజృంభించాడు. ఆర్పీ సింగ్‌ వేసిన 17వ ఓవర్లో ఏకంగా అయిదు బౌండరీలు బాదాడు. దీనితో ఒక్కసారిగా స్కోరు వేగం పుంజుకుంది. అంతకుముందు రోహిత్‌ శర్మ ఓవర్లో ఒక సిక్సర్‌, బౌండరీతో జయవర్ధనె పరుగుల వేగానికి శ్రీకారం చుట్టాడు. హ్యారిస్‌ వేసిన 19వ ఓవర్లో యువరాజ్‌ సిక్సర్‌ కొట్టగా, జయవర్ధనె రెండు బౌండరీలు సాధించాడు. ఆర్పీ సింగ్‌ వేసిన చివరి ఓవర్లో జయవర్ధనె ఒక సిక్సర్‌, ఒక బౌండరీ కొట్టగా, భారీ షాట్‌ ప్రయత్నించి యువరాజ్‌ అవుటయ్యాడు. యువరాజ్‌ 20 బంతులలో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. జయవర్ధనెతో కలిసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించడంలో సహకరించాడు. కింగ్స్‌ ఎలెవెన్‌ చివరి అయిదు ఓవర్లలో 76 పరుగులు కొల్లగొట్టింది.

స్కోర్‌బోర్డ్‌

కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ - మహేల జయవర్ధనె నాటౌట్‌ 93, షాన్‌ మార్ష్‌ సి గిల్‌క్రిస్ట్‌ బి హారిస్‌ 0, కుమార సంగక్కర సి ఓజా బి రాహుల్‌ శర్మ 52, యువరాజ్‌ సింగ్‌ సి సిమండ్స్‌ బి ఆర్పీ సింగ్‌ 20, ఇర్ఫాన్‌ పఠాన్‌ నాటౌట్‌ 1, అదనపు పరుగులు 8, మొత్తం (3 వికెట్లకు) 174.

వికెట్ల పతనం : 1-1(మార్ష్‌, 2-87(సంగక్కర), 3-173(యువరాజ్‌).

బౌలింగ్‌ : ర్యాన్‌ హారిస్‌ 4-0-27-1, ఆర్పీ సింగ్‌ 4-0-51-1, మిచెల్‌ మార్ష్‌ 4-0-32-0, ఆండ్రూ సిమండ్స్‌ 2-0-16-0, రోహిత్‌ శర్మ 1-0-8-0, ప్రగ్యాన్‌ ఓజా 2-0-19-0, రాహుల్‌ శర్మ 3-0-18-1.

దక్కన్‌ చార్జర్స్‌ ఇన్నింగ్స్‌ - ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ సి థెరాన్‌ బి పఠాన్‌ 9, మోనిష్‌ మిశ్రా ఎల్‌బి బి మాలిక్‌ 20, తిరుమలశెట్టి సుమన్‌ సి సంగక్కర బి చావ్లా 43, రోహిత్‌ శర్మ నాటౌట్‌ 68, ఆండ్రూ సిమండ్స్‌ బి థెరాన్‌ 4, మిచెల్‌ మార్ష్‌ సి జయవర్ధనె బి యువరాజ్‌ సింగ్‌ 15, బోడపాటి సుమంత్‌ నాటౌట్‌ 6, అదనపు పరుగులు 13, మొత్తం (5 వికెట్లకు) 178.

వికెట్ల పతనం : 1-13(గిల్‌క్రిస్ట్‌), 2-54(మిశ్రా), 3-120(సుమన్‌), 4-126 (సిమండ్స్‌), 5-154(మార్ష్‌).

బౌలింగ్‌ : విక్రమ్‌జిత్‌ మాలిక్‌ 2.1-0-23-1, ఇర్ఫాన్‌ పఠాన్‌ 3-0-35-1, శలభ్‌ శ్రీవాస్తవ 4-0-36-0, జువాన్‌ థెరాన్‌ 4-0-32-1, పియుష్‌ చావ్లా 4-0-24-1, యువరాజ్‌ సింగ్‌ 2-0-22-1.

కింగ్స్‌ ఎలెవెన్‌ ఫ్రాంచైజీ కొనుగోలుకు సైఫ్‌,కరీనా జంట ఆసక్తి

ఈ ఏడాది ఐపిఎల్‌లో నిరాశాజనకమైన ప్రదర్శన ఇస్తున్న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ను అమ్మివేసేందుకు ఆ ఫ్రాంచైజీ యజమానులు నిర్ణయించుకోవడంతో దానిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్న వారిలో బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌కూడా ఉన్నారు. ఇటీవల కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఉత్సాహం చూపిన ఈ జంట ఇపుడు కింగ్స్‌ ఎలెవెన్‌పై కన్నేసింది. వీరు వీడియోకాన్‌ సంస్థతో కలిసి కింగ్స్‌ ఎలెవెన్‌ను దక్కించుకోవాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. వీడియోకాన్‌ సంస్థ, సైఫ్‌-కరీనా జంట, పూణకు చెందిన బిల్డర్‌ అతుల్‌ కార్డియా ఒక కన్సార్టియంగా ఏర్పడి ఐపిఎల్‌ జట్టును కొనాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని వీడియోకాన్‌ సంస్థ యజ మానుల్లో ఒకరైన వేణుగోపాల్‌ ధూత్‌కూడా నిర్ధారించారు. ఐపిఎల్‌-4 వేలంలో పూణ ఫ్రాంచైజీని దక్కించు కునేందుకు వీరు వెయ్యి కోట్ల రూపాయల బిడ్డింగ్‌ వేసి విఫలమయ్యారు. కింగ్స్‌ ఎలెవెన్‌ సహ యజమానులైన బాలీవుడ్‌ నటి ప్రీతి జింతా, డాబర్స్‌ సంస్థకు చెందిన మోహిత్‌ బర్మన్‌, అపీజే సురేంద్ర గ్రూప్‌కు చెందిన కరణ్‌ పాల్‌, బాంబే డైయింగ్‌ అధినేత నెస్‌ వాడియాలు 2008లో కింగ్స్‌ ఎలెవెన్‌ను 76 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌ అనంతరం ఆ ఫ్రాంచైజీ విలువ వెయ్యి కోట్ల రూపాయలని అంచనా.

మూడో రౌండ్‌కు వోజ్నియాకి

చార్లెస్టన్‌ : టాప్‌ సీడ్‌ కరోలిన్‌ వోజ్నియాకి ఫామిలీ సర్కిల్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌కు చేరుకుంది. వోజ్నియాకి రెండో రౌండ్‌లో 6-4, 6-1 స్కోరుతో చెక్‌ క్రీడాకారిణి బార్బరా జహ్లవోవ స్టైర్కోవాపై సునా యాస విజయాన్ని నమోదు చేసుకుంది.

 

Copyright 2009 @ Vizag4All.
All Rights Reserved.
Home  |  About Vizag  |  Movies  |  Videos  |  Images  |      City Dial  |  Tips  |  Contact Us